ఈ యేడాది మహాలయ
అమావాస్య అక్టోబర్ 12 2015 వ తేదీన
జరుపుకుంటారు. మహాలయ అమావాస్య నాడు
పితృదేవతలకు అర్ఘ్యము ఇవ్వడం ద్వారా వంశాభివృద్ధి ప్రాప్తిస్తుంది
MAHALAYA AMAVASYA
SARVAPITRA MOKSHA AMAVASYA ON 12TH OCTOBER 2015..
మహాలయము
అనగా గొప్ప వినాశనము లేక చావు అని అర్థము. భాద్రపద
కృష్ణ పక్షంలో హిందువులు తమతమ పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. మహాలయ
పక్షంలోని చివరి తిథి అయినా ‘అమావాస్య’ నాడైనా పితృతర్పణాదులు
విడుచుట మంచిది. అన్ని వర్ణముల వారు తిలతర్పణం
చేస్తారు. ఈ పక్షమునందు ఇది వరకు తిల
తర్పణములచే పూజింపకుండినట్టు పితృదేవతలకు తర్పణము చేయవలెనని
భవిష్యత్పురాణంలో ఉంది. దేవతా పూజలతో పాటూ పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన
మాసం భాద్రపద మాసం. ఈ మాసంలోని శుక్ల పక్షం దేవతా
పూజలకు కృష్ణపక్షం
పితృదేవతలకు ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోని
కృష్ణపక్షానికి ‘పితృపక్షం’ లేక
మహాలయ పక్షం అని అంటారు. పితృదేవతలకు
అత్యంత ఇష్టమైన
ఈ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్దవిధులను నిర్వహించడం, పిండ
ప్రదానాలు చేయడం మంచిది. అందువల్ల గయలో శ్రాద్ధకర్మలను చేసిన ఫలం
కలుగుతుంది. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అర్ఘ్యము ఇవ్వడం ద్వారా
వంశాభివృద్ధి ప్రాప్తిస్తుంది.
No comments:
Post a Comment